Monday, August 4, 2025

హైదరాబాద్ అంతర్జాతీయ ఫార్మా కంపెనీలకు గమ్యస్థానం: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారని అన్నారు. అమెరికాకు చెందిన లిల్లీ ఫార్మా కంపెనీని, గచ్చిబౌలిలో ప్రముఖ ఫార్మా కంపెనీని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో సిఎం, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకే ప్రత్యేకమైన జినోమ్ వ్యాలీ ఉందని తెలియజేశారు. మెడ్ టెక్నాలజీకి రాష్ట్రం ప్రత్యేకమైన హబ్ గా ఎదుగుతోందని, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉందని ప్రశంసించారు.

హైదరాబాద్ లో అత్యాధునికమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center) ఉందని, ఎఐ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే చాలా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయని, ఇప్పుడు మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు జతకలవడం సంతోషకరంగా ఉందని కొనియాడారు. పరిశ్రమలకు, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించామని పేర్కొన్నారు. గత 19 నెలల్లో తెలంగాణ రూ.3.2 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించిందని, కొత్త పెట్టుబడుల సాధనలో గుజరాత్, తమిళనాడు తర్వాత తెలంగాణ నిలిచిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జినోమ్ వ్యాలీ, మెడ్ టెక్ పార్కును మరింత విస్తరించే ప్రణాళికలతో ఉన్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News