Tuesday, April 30, 2024

కుండపోత

- Advertisement -
- Advertisement -

Heavy Rain Hits Hyderabad

హైదరాబాద్: కుంభవృష్టి వర్షంతో నగరవాసులు గజగజ వణికిపోయారు. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరం పూర్తిగా చెరువులను తలపించింది. కాలనీలు, బస్తీలు రోడ్లు పూర్తిగా కాల్వలను తలపించాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్భందనంలో చిక్కుకున్నాయి వేలాది కాలనీలు బస్తీలులోని పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. మురికి వాడల్లో ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. ఇళ్లులోకి నీరు చేరడంతో వారు రాత్రింతా జాగారం చేశారు. పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడ్డారు. భారీ వర్షంతో నగరంలోని అన్ని రహదారులు పూర్తిగా నీట మునుగడంతో ఎక్కడకక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నగరాన్ని ఉదయం నుంచి మేఘాలు కప్పివేయగా సాయంత్రం 4 గంటలకే నగరంలో చీమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.

నగరం వ్యాప్తంగా 7 గంటల వరకే 10 సె.మి.వర్షపాతం నమోదు కావడంతో గరవాసులు పూర్తిగా వణికిపోయ్యారు. ఉదయం మొదలైన వర్షం ఏకధాటిగా కొనసాగింది. నగరవ్యాప్తంగా 160పైగా అత్యవసర సహాయ బృందాలతో పాటు మరో 19 డిఆర్‌ఫ్ బృందాలు రోజు మొత్తం శ్రమించినప్పటీకీ పరిస్థితులో ఏలాంటి మార్పు రాలేదు. రోడ్లు, కాలనీలు, ఇళ్లలో గంటల తరబడి వరద నీటిలోనే చిక్కుకున్నాయి. ఎల్‌బినగర్, సరూర్‌నగర్, కొత్తపేట సైదాబాద్, మలక్‌పేట్, దిల్‌సుఖ్ నగర్, ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, అంబర్‌పేట్, గోల్నాక, కాచిగూడ, హిమాయత్‌నగర్, నల్లకుంట, రాంనగర్, ముషీరాబాద్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, మౌలాలి, కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, ఎఎస్‌రావు నగర్, తిరుమల్‌గిరి, లాలాబజార్, బొల్లారం, సుచిత్ర, బోయిన్‌పల్లి, బాలానగర్, కుత్భులాపూర్, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, కొండాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, గచ్చిబౌలి, టోలిచౌకి, మెహిదిపట్నం, లక్డీకాపూల్, నాంపల్లి, అప్జల్ గంజ్, కోఠి, చార్మినార్, చంద్రాయణ్‌గుట్టరాజేంద్ర నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎడ తెరిపి లేని వర్షం కురిసింది.

రహదారులు పూర్తిగా వాహన దిగ్బంధనం

భారీ వర్షంతో నగర రహదారులన్ని వాహన దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రోడ్లు పూర్తిగా కాల్వలను తలపించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయ్యాయి. నడుం లోతుకు మించి వరద నీరు చేరడంతో వాహనాలు పూర్తిగా నీటిలో చిక్కుకుని మొరాయించాయి. నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో వాహనాలు వేలసంఖ్యలో బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు పూర్తిగా వర్షం తడిసి ముద్దైయ్యారు. ఎల్‌నగర్ మొదలు దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి, లక్డీకాపూల్ , మెహిదీపట్నం వరకు పూర్తిగా వాహనాలు నిలిచిపోయ్యాయ. అదేవిధంగా మాసబ్‌టాక్‌నుంచి పెన్షన్ లైన్‌మీదగా జూబ్లీహిల్స్ వెళ్లే మార్గం పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్ మీదగా బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, మేడిపల్లి వరకు ట్రాపిక్ పూర్తిగా స్థభించిపోయింది. చాదర్ ఘాట్ రోడ్లు వరద ప్రహావంలో చిక్కుకోగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది.

అవసరుముంటే తప్ప బయటికి రావొద్దు

భారీ వర్షాల నేపథ్యంలో మరీ అత్యవసరమైతే తప్ప నగరవాసులు ఎవరూ బయటికి రావొద్దని జిహెచ్‌ఎంసి అధికారులు విజప్తి చేశారు. ఏలాంటి విపత్క పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిహెచ్‌ఎంసి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇప్పటికే వందలాది సహాయ బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయని, లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అత్యవసర సహాయ నంబర్లను ప్రకటించారు. ఏలాంటి సమస్య ఉన్నా ఈ కింద నంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా అక్కడ నెలకొన పరిస్థితులకు సంబంధించి ఫోటోలను తీసి పంపించవచ్చాని తెలిపారు.

హెల్ప్‌లైన్ నంబర్లు

డిజాస్టర్ మేనేజ్‌మెంట్      9000113667
విభాగం సెల్ నంబర్
జిహెచ్‌ఎంసి ట్రీ కటింగ్     6309062583
వాటర్ లాంగింగ్            9000113667
ఎలక్ట్రికల్ కంట్రోల్ రూం     9440813750
ఎన్‌డిఆర్‌ఎఫ్              8333068536
ఎంసిమెచ్ డిజాస్టర్       97046018166

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News