Tuesday, April 30, 2024

నగరంలోని స్టార్ హోటల్‌లో అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Mumbai woman was raped at Star Hotel in Hyderabad

నిందితుడికి సహకరించిన ఇద్దరు యువతులు
ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్

హైదరాబాద్: నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో ముంబాయికి చెందిన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీనికి ఇద్దరు యువతులు సహకరించారు. బాధితురాలు ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. అక్కడి పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు కేసు అప్పగించడంతో దర్యాప్తు చేశారు. ముంబై నుంచి వచ్చిన యువతిపై మద్యం తాగిన జుబేర్ అత్యాచారం చేశాడు.

దీనికి స్వీటీ, ప్రజక్త సహకరించారు. అంతేకాకుండా యువతి న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించారు. కేసు వాపసు తీసుకోకుంటే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అంతటితో ఆగకుండా బాధిత యువతి వాట్సాప్‌కు ఫొటోలు, వీడియోలు పంపించి బెదిరించారు. బాధితురాలు బట్టలు మార్చుకునే సమయంలో ప్రజక్త వీడియోలు తీసింది. ముంబాయికి చేరుకున్న తర్వాత యువతి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేయడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News