నాగ్‌పూర్: మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ అధికారి మద్యం మత్తులో కారు నడిపి 30 మందిని ఢీకొట్టాడు. హర్ష్‌పాల్ మహదేవ్ అనే ఆర్మీ అధికారి ఆదివారం రాత్రి 8.30 గంటలకు నాగర్ధాన్‌లోని దుర్గా చౌక్ నుంచి హమ్లాపురికి కారు బయలుదేరాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతని డ్రైవింగ్‌లో కారు నియంత్రణ కోల్పోయి 30 మంది పాదచారులను ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడి.. పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. స్థానికులు హర్ష్‌పాల్‌ను కారులో నుంచి బయటకు తీసి నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు బాధితుల బంధువులతో కలిసి చితకబాదారు. తీవ్రంగా దాడి చేయడంతో ఆర్మీ అధికారి ముఖంపై తీవ్ర గాయలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు (Maharashtra) ఘటనాస్థలికి చేరుకొని.. హర్ష్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారికి కూడా వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్సాంలోని సైన్యంలో సదరు వ్యక్తి పని చేస్తున్నట్లు నాలుగు రోజుల సెలవుల్లో భాగంగా మహారాష్ట్రలోని స్వగ్రామం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.