మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌పై కక్ష పెంచుకున్న సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపి ఆయనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందే కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎంఎల్‌ఎ ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్ అని జీవన్‌రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆరేళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నూరేళ్ళ కన్నీళ్లు తుడిచాయని పేర్కొన్నారు. కెసిఆర్ అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌పై నిందలు మోపిన సిఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.కెసిఆర్ జోలికొస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
కెసిఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమే: జీవన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -