Wednesday, August 6, 2025

ట్రంప్ వార్నింగ్.. భారత్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని.. లేదంటే అధిక సుంకాలు విధిస్తామంటూ భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి దిగుమతుల విషయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని భారత్ మండిపడింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సాఫ్ల్లోరైడ్‌ను, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను అమెరికా రష్యా నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించింది. రష్యా నుంచి మీరు దిగుమతులు చేసుకుంటే ఒప్పు, మేము దిగుమతి చేసుకుంటే తప్పా అంటూ నిలదీసింది. ఉక్రెయిన్ ఘర్షణల అనంతరం అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే దేశీయ ఇంధన అవసనాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకొంటున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. తమ దేశ ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకొంటామని భారత్ తేల్చి చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News