Sunday, September 21, 2025

నేటి నుంచి బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సా మూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళ లు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న బతుకమ్మ పం డుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయి న బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆ కాంక్షించారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వర కూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆట పాటలతో అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవాలన్నారు.

ఓరుగల్లు గడ్డ మీద నేటి నుంచి
బతుకమ్మ సంబురాలు
ఆదివారం నుంచి ఆడబిడ్డల ఆత్మగౌరవ అడ్డ ఓరుగల్లు గడ్డ మీద బతుకమ్మ సంబురాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తం భాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ఆరంభ వేడుకల్లో మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు వరంగల్ పట్టణంలోని వెయ్యి స్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక: కెసిఆర్
తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నదనీ అన్నారు. సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో, నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు.

గవర్నర్ శుభాకాంక్షలు
బతుకమ్మ పండుగ ప్రారంభమైన శుభ సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అనేది ప్రకృతి మాతతో ముడిపడి ఉన్న చాలా ప్రత్యేకమైన పండుగ అని, ఇది ముఖ్యంగా తెలంగాణ మహిళలు జీవిత వేడుకగా పేర్కొన్నారు. బతుకమ్మను తయారు చేయడానికి ఉపయోగించే రంగురంగుల కాలానుగుణ అడవి పువ్వులు, సీజన్లో కురిసే వర్షాల ద్వారా నిండిన నీటి వనరులను శుభ్రపరచడంలో సహాయపడే ఔషధ గుణాలను కలిగి ఉంటాయని గవర్నర్ తెలిపారు.

ప్రకృతిని దైవంగా పూజించే గొప్ప పండుగ: కోమటిరెడ్డి
తెలంగాణ ఆడబిడ్డలందరికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణం బతుకమ్మ పండుగని, సాయుధ రైతాంగ పోరాటంలో, రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని గుర్తు చేశారు.

Also Read: ఆస్ట్రేలియా మహిళలదే సిరీస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News