చెన్నై: రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ క్రమంలో ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John) చేసిన తాజా కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమా విడుదలకు ముందు ఒకలా.. విడుదల తర్వాత ఒక మాట మాట్లాడుతారా.. అని ప్రశ్నిస్తున్నారు. రెబా మంగళవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాుడూతూ ‘‘కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. నేను ఆశించిన స్థాయిలో ఆ పాత్ర తెరకెక్కలేదు. ఆ విషయంలో నిరుత్సాహపడ్డా. కానీ, రజనీకాంత్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అని పేరక్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై రజనీ ఫ్యాన్స్ రెబాపై (Reba Monica John) ఫైర్ అవుతున్నారు. గతంలో ఆమె ఈ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఉన్న వీడియోని షేర్ చేస్తున్నారు. అందులో ఆమె కూలీలో నటించే అవకాశం తానే అడగానని అది పెద్ద రోల్ కాదని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చెప్పారని వెల్లడించింది. దీంతో అప్పుడు అలా మాట్లాడి.. ఇప్పుడు మాట మార్చడంపై ఫ్యాన్స్ రెబా మోనిజా జాన్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ సోదరి పాత్రలో రెబా నటించారు.
Also Read : అంగరంగ వైభవంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవం