Wednesday, September 24, 2025

హైకోర్టులో మస్క్ ‘ఎక్స్’కు చుక్కెదురు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. సమాచారాన్ని బ్లాక్ చేయాలని ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని ఎక్స్ కోర్టులో సవాలు చేసింది. ఆ పిటిషన్‌ను తాజాగా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భారత్‌లో ఎలాంటి నియంత్రణ లేకుండా సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అమెరికా న్యాయ తార్కికతను ఇక్కడకు తీసుకురావొద్దని హెచ్చరించింది. ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకున్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికే వస్తుందని ఎక్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వంపై కొన్ని నెలల క్రితం దావా వేసింది. ప్రభుత్వం ఐటీ చట్టం లోని సెక్షన్ 79(3) (బి)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.

ఐటీ చట్టం ప్రకారం .. బ్లాక్ చేసిన కంటెంట్‌ను తొలగించకపోతే , ఎక్స్ తన చట్టబద్ధమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సెక్షన్ కింద కంటెంట్ బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వలేదని సెక్షన్ 69ఎ ని పక్కదారి పట్టించడానికి అధికారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత కోర్టు తీర్పు వెలువడింది. ఎవరినైనా ఉరి తీస్తున్నారంటే తప్ప మరే కేసునూ అదే రోజున అత్యవసరంగా విచారించబోమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది. న్యాయమూర్తులపై ఉండే ఒత్తిడి, పని గంటల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించింది. తాము ఎన్నిగంటలు నిద్రపోతున్నామో తెలుసా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బుధవారం ధర్మాసనం అత్యవసర జాబితా కోసం కేసులను పరిశీలిస్తున్న నేపథ్యంలో శోభాగుప్తా అనే న్యాయవాది ఓ పిటిషన్‌ను న్యాయస్థానానికి అందజేశారు. రాజస్థాన్ లోని ఒక నివాస గృహాన్ని ఈరోజు వేలం వేయనున్నారని, ఇవాళ విచారణ జరపకపోతే ఇల్లు చేజారి పోతుందని పేర్కొన్నారు. అందువల్ల దానిపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీం కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకరి స్వేచ్ఛ ప్రమాదంలో ఉంటే తప్ప తాము అత్యవసరంగా విచారణ చేపట్టబోమని స్పష్టం చేశారు. అనంతరం ఇల్లు వేలం నోటీసు ఎప్పుడు జారీ చేశారని జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాదిని అడిగారు. గతవారం వేలం నోటీసు జారీ చేశారని, బకాయి ఉన్న మొత్తంలో ఇప్పటికే సగం చెల్లించారని లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో శుక్రవారం ఈ పిటిషన్‌ను జాబితాలో చేర్చాలని న్యాయమూర్తి సూచించారు.

Also Read: లేహ్‌లో ఆందోళనలు హింసాత్మకం.. నలుగురి మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News