Monday, April 29, 2024

బుమ్రాకు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

Bumrah

 

ముంబయి: టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో బుమ్రాకు ఈ అవార్డు అందజేయనున్నారు. 2018 జనవరిలో భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, విడీస్ జట్లపై అయిదేసి వికెట్ల చొప్పున రాణించాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇక మహిళా జట్టులో పూనమ్ యాదవ్ ఈ అవార్డుకు ఎంపికైంది. పూనమ్ ఇటీవల అర్జున పురస్కారాన్ని కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కల్నల్ సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును, మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా బిసిసిఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోనున్నారు.

A rare honor for Bumrah
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News