Thursday, April 18, 2024

సరిహద్దులో యువకుడి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి….

- Advertisement -
- Advertisement -

Pakistan

 

 

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దులో ఇద్దరు కశ్మీర్‌లను చంపి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాక్ సైన్యం మోర్టర్లతో దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఒకరి తలను మొండెం నుంచి వేరు చేసి దుండగులు తీసుకెళ్లారు. ఈ దురాగాతానికి పాక్ సైన్యం పాల్పడి ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు అస్లాం హుస్సేన్(23)గా గుర్తించారు. మృతదేహాలను ఆర్మీ అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు. అస్లాం తలను పాక్ సైన్యానికి సహాయం చేసిన వారే తీసుకొని పోవచ్చని ఆర్మీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల వెంట ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె తెలిపారు.

 

Pakistan army Killed two Kashmirs with Mortors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News