Saturday, April 27, 2024

తొలి భారత క్రికెటర్ గా దీప్తి శ‌ర్మ అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ అరుదైన రికార్డు సాధించింది. టీ20 క్రికెట్ కెరీర్ లో దీప్తి.. 1000 పరుగులు చేయడంతోపాటు 100 వికెట్లను తన ఖాతాలో వేసుకుని నయా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు మెన్స్ క్రెకెట్ లోనూ ఈ ఘనతను ఎవరూ సాధించలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా దీప్తీ నిలిచింది.

గత ఆదివారం ఆస్ట్రేలియా-భారత్ మహిళ జట్లు మద్య రెండో టీ20 జరిగిన విషయ తెలిసిందే. ఈ మ్యాచ్ లో దీప్తి శర్మ.. 30 ప‌రుగుల‌ు చేయడంతో పాటు రెండు వికెట్లు తీయడంతో ఈ అరుదైన ఫీట్ ను అందుకుంది. అయితే, ఈమ్యాచ్ లో ఆసీస్‌ బ్యాట్స్ ఉమెన్స్ రాణించడంతో భారత్ ఓడిపోయింది. దీంతో రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News