Saturday, October 5, 2024

అతిషి డమ్మీ సిఎం: ఎంపీ స్వాతి మలివాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న రాష్ట్ర మంత్రి ఆప్ నాయకురాలు అతిషిపైసొంత పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తీవ్ర విమర్శలు చేశారు. అతిషి కేవలం ‘డమ్మీ సీఎం’ అని మలివాల్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి రక్షించేందుకు అతిషి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడిన స్వాతి మాలివాల్.. “ఈ రోజు ఢిల్లీకి విచారకరమైన రోజు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులైన అతిషి కుటుంబం తీవ్రవాది అఫ్జల్ గురును ఉరి నుండి రక్షించడానికి సుదీర్ఘ పోరాటం చేసింది. ఆమె తల్లిదండ్రులు అఫ్జల్ గురును కాపాడాలని కోరుతూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు కూడా రాశారు. అతిషి మర్లేనా కేవలం ‘డమ్మీ సిఎం’ అయినప్పటికీ, ఈ విషయం దేశ భద్రతకు సంబంధించినది!” అని స్వాతి మలివాల్ ఎక్స్ లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News