Wednesday, August 6, 2025

సబితా పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి: హరీశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సబితా ఇంద్రారెడ్డి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మహిళ ఎమ్మెల్యే పట్ల అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పా అని హరీశ్ ప్రశ్నించారు. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్లాగా బెదిరింపులకు పాల్పడుతుంటే.. అడ్డుకోవాల్సిన పోలీసులే వారితో కలిసి మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. మాజీ మంత్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో హోంమంత్రిగా ఉన్న సిఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని హరీశ్ (Harish Rao) అన్నారు.

అసలేం జరిగిందంటే.. మహేశ్వరం నియోజవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వేదికపై కూర్చున్నారు. ఇదేం పద్దతి అని అడిన సబితా ఇంద్రారెడ్డిపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకువచ్చారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ కూర్చున్నారని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ ఈ ఘటనను ఖండించారు. మూడు సంవత్సరాలలో తమ ప్రభుత్వం వస్తుందని… అప్పుడు అందరి పని చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News