Sunday, June 16, 2024

బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసు: నటి హేమ రక్త నామూనాలో డ్రగ్స్ ఆనవాలు

- Advertisement -
- Advertisement -

బెంగుళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమతోపాటు పలువురు నటులు పారల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 150 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షించింది నార్కోటిక్ టీమ్. ఈ రక్త నమూనాలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు.. మొత్తం 86 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ టెస్టులో సినీ నటి హేమతోపాటు తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో చర్యలు తీసుకునేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. 86 మందికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. అయితే, నటి హేమ బాధితురాలిగా చేర్చే అవకాశం ఉందని.. దాంతో ఆమెకు నోటీసులిచ్చి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News