Monday, April 29, 2024

సూర్యుడ్ని తొలిసారి ఫొటో తీసిన ఆదిత్య ఎల్-1

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆదిత్య ఎల్-1 మరో ఘనత సాధించింది. సూర్యుడ్ని తొలిసారి ఫొటో తీసింది. ఆ చిత్రాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) శుక్రవారం విడుదల చేసింది. సూర్యుడి గురించి పరిశోధనల కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 2న తొలి సన్ మిషన్ ఆదిత్య ఎల్-1ను ఇస్రో లాంచ్ చేసింది. నవంబర్లో అది సూర్యుడి సమీపానికి చేరుకుంది. దీంతో ఆదిత్య-ఎల్1లో ఉన్న సోలార్ అల్ట్రావైలైట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్యూఐటీ)ను నవంబర్ 20న యాక్టివేట్ చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6న సూర్యుడి గుండ్రటి తొలి చిత్రాన్ని తీసిందని ఇస్రో తెలిపింది. ఆ ఫొటోను శుక్రవారం విడుదల చేసింది. సౌర పరిశీలన, పరిశోధనలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించింది.

కాగా, ఎస్యూఐటీ ద్వారా 200 నుంచి 400 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో సూర్యుడు కనిపించే ఉపరితలం, దానిపై ఉండే పారదర్శక పొరకు సంబంధించిన సన్ ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ చిత్రం చాలా అద్భుతంగా ఉందని ఇస్రో తెలిపింది. సూర్య కిరణాలు, సోలార్ స్పాట్లు, సోలార్ రేడియేషన్ను అధ్యయనం చేయడానికి ఈ పొరలు కీలకమని వివరించింది. అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణంపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. సూర్యుడి వాతావరణానికి సంబంధించిన వివరణాత్మక పరిశీలన కోసం ఈ టెలిస్కోప్కు 11 వేర్వేరు ఫిల్టర్లు ఉన్నట్లు పేర్కొంది. ఆదిత్య ఎల్-1ను ప్రయోగించిన సుమారు 127 రోజుల తర్వాత, 2024 జనవరి 7న నిర్దేశిత కక్ష్య ఎల్1ను ఇది చేరవచ్చని ఇస్రో అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News