Wednesday, August 6, 2025

అమెరికాలో కూలిన విమానం: నలుగురు వైద్య సిబ్బంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని అరిజోనాలో బుధవారం ఉదయం విమానం కూలింది. చిన్లే మున్సిపల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం కూలడంతో నలుగురు వైద్య సిబ్బంది మృతి చెందారు. నవాజో నేషన్‌లో మంటల్లో చిక్కుకొని ల్యాండింగ్‌కు ముందు బీచ్ క్రాఫ్ట్ 300 విమానం కుప్పకూలింది. చిన్లే ఆస్పత్రి నుంచి రోగిని తీసుకరావడానికి వెళ్తుండగా మెడికల్ ట్రాన్స్‌పోర్టు విమానం కూలింది. నవాజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వైద్యులు ఇతరులను రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేశారని ప్రశంసించారు. వైద్యుల సేవ, త్యాగంతో పాటు మనపై ఎంతో ప్రేమను చూపించేవారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News