Saturday, May 4, 2024

ముస్లింలపై మోడీ వ్యాఖ్యలకు ఎఐఎడిఎంకె ఆక్షేపణ

- Advertisement -
- Advertisement -

భారత సార్వభౌమాధికారానికి అది విరుద్ధం
పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి

చెన్నై : ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలకు ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి మంగళవారం ఆక్షేపణ తెలియజేశారు. రాజకీయ నేతలు విద్వేష ప్రసంగాలు చేయకూడదని, అది భారత సార్వభౌమాధికారానికి విరుద్ధమని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆ పార్టీ పూర్వపు విధానాలు లక్షంగా ప్రధాని ఈ నెల 21న రాజస్థాన్ బన్‌స్వాడాలో చేసిన ప్రసంగాన్ని పళనిస్వామి ప్రస్తావిస్తూ, ముస్లింల గురించి అనుచిత రీతిలో మాట్లాడడం ద్వారా మోడీ వివాదం రేపారని ఆరోపించారు.

‘భారత్ లౌకిక దేశం. వోటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నేతలు మాట్లాడడం సముచితం కాదు. ప్రధాని వంటి అత్యున్నత పదవిని అధిష్ఠించిన వ్యక్తి భారత సార్వభౌమాధికారానికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేయరాదు’ అని పళనిస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మైనారిటీ వర్గాల మనస్సుల్లో భయం సృష్టిస్తాయని, మత ద్వేషాన్ని రెచ్చగొడుతాయని పళనిస్వామి అన్నారు. నిరుడు సెప్టెంబర్‌లో ఎన్‌డిఎ నుంచి ఎఐఎడిఎంకె నిష్క్రమించిన తరువాత మోడీని పళనిస్వామి విమర్శించడం బహుశా ఇదే మొదటి సారి కావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News