Saturday, May 4, 2024

భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు

- Advertisement -
- Advertisement -

మతం, భాష, దుస్తుల కోడ్‌లో ఏకరూపత సాధ్యం కాదు
జెఎన్‌యు విసి శాంతిశ్రీ పండిట్

న్యూఢిల్లీ : మతం, భాష, దుస్తుల కోడ్‌లో ఏకరూపత భారత్‌లో సాధ్యం కాదు అని, దేశం ఏదో ఒక వర్గానికి చెందినది కాకపోవడమే ఇందుకు కారణం అని జెఎన్‌యు వైస్ చాన్స్‌లర్ శాంతిశ్రీ పండిట్ అన్నారు. ఢిల్లీలో పిటిఐ వార్తా సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎడిటర్లతో పండిట్ ముఖాముఖి సాగిస్తూ, విద్యా సంస్థలు వ్యక్తిగత నిర్ణయాలను మన్నించాలని, హిజాబ్‌ను ధరించాలనుకునేవారిని అలా చేయనివ్వాలని సూచించారు. ‘మతంలో గాని, జాతిలో గాని, భాషలో గాని ఏకరూపతను అంగీకరించను. ఏదో ఒక భాషను అందరిపై రుద్దరాదు.

కొన్ని రాష్ట్రాల్లో కొందరు దానిని (అధికార భాషను) హిందీకి మార్చాలని కోరుకుంటే వారు చేయవచ్చు. అయితే, దక్షిణాదిలో అది కష్టం& తూర్పు భారతదేశంలోనూ, తుదకు మహారాష్ట్రలోనూ హిందీని అంగీకరిస్తారని అనుకోను’ అని ఆమె చెప్పారు. ‘హిందీ ఉండవచ్చు కానీ ఒక్క భాషను అందరిపై రుద్దరాదని అంటాను. (జవహర్‌లాల్) నెహ్రూ, ఇందిరా గాంధీ ఇద్దరూ త్రిభాషా సూత్రం గురించి మాట్లాడేంత మూర్ఖులు కారు. ఎందుకంటే భారత్లో ఏకరూపత ఏవిధంగాను పని చేయదు’ అని పండిట్ అన్నారు.

జాతీయ భాషగా, బోధన, నేర్చుకోవడంలో ప్రధాన బోధన మీడియాల్లో ఒకటిగా హిందీ కోసం పట్టుబట్టడంపై ప్రశ్నకు విసి ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ‘భాష సున్నితమైన అంశం. ఆ విషయంలో ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు నన్ను అడిగినట్లయితే, ఒక్క భాషే ఉండాలనడంలో మీరు నింపాదిగా వ్యవహరించాలని అంటాను’ అని ఆమె చెప్పారు. ఒకే ఉనికి, మతం దేశంలో పనిచేయవని కూడా పండిట్ అన్నారు. విద్యా సంస్థల్లో దుస్తుల నియమావళి గురించి మీ అభిప్రాయాలు ఏమిటన్న ప్రశ్నకు పండిట్ సమాధానం ఇస్తూ, అది వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News