Thursday, May 9, 2024

ఐదేళ్లలో మస్తుగా.. మద్యం విక్రయాలు

- Advertisement -
- Advertisement -
alcohol
ఏకంగా 65 శాతం పెరుగుదల

హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన విక్రయాలతో చూస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి ఎపిలో 8 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా రూ. 10 వేల కోట్లు మద్యం అమ్మకాల ద్వారా రాలేదు. అప్పుడు ఏడాదికేడాది 14 శాతం నుంచి 20 శాతం మాత్రమే ఆదాయం పెరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం అది ఎప్పుడూ ఇరవై శాతం కంటే తగ్గలేదు. అయితే 2018-19లో అంతకుముందు ఏడాది 201718 తో పోలిస్తే 65 శాతం పెరిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇంకా మూడు నెలలు మిగిలి ఉండగానే.. రూ.18,780 కోట్ల రాబడి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు కలిసి రావడంతో చివరి త్రైమాసికం ముగిసే సరికి రూ.25 వేల కోట్లకు మించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

2018 డిసెంబరుతో పోలిస్తే.. 2019 డిసెంబరులో కేవలం 4.16 శాతం మేర అదనపు విక్రయాలు నమోదయ్యాయి. వాస్తవానికి ఇది ఎక్కువగా ఉండాలని, విక్రయాలు తగ్గడానికి కారణాలేంటో వివరణ ఇవ్వాలని ఎకె్సైజ్ శాఖ ఆదేశించడం గమనార్హం. సింగరేణి ప్రాంతంలోని ఎకె్సైజ్ స్టేషన్ల పరిధిలో మద్యం విక్రయాలు పడిపోయాయని గుర్తించారు.114 స్టేషన్లకు గాను.. 20 ఎకె్సైజ్ స్టేషన్ల పరిధిలో మైనస్ విక్రయాలు నమోదైనట్లు అధికారులు విశ్లేషించారు.

లిక్కర్ రేట్లు పెరగడం, గుడంబా వినియోగం తగ్గడమే మద్యం ద్వారా రాబడి పెరగడానికి ప్రధాన కారణాలని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. బేసిక్ ప్రైస్(కనీస ధరలు)ను 2017లో వివిధ శ్లాబులపై 5, 8, 10, 12 శాతాలుగా పెంచారు. దాంతో మద్యం ధరలు రూ.10 నుంచి -30 వరకు పెరిగాయి. గత డిసెంబర్‌లో ప్రభుత్వం అదనపు ఎకె్సైజ్ ట్యాక్స్‌ను పెంచింది. క్వార్టర్‌పై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 వరకు, స్కా వంటి ప్రీమియం బ్రాండ్లపై రూ.150 మేర ధరలు పెరిగాయి.

alcohol-sales

alcohol sales rise 65 percent in five years in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News