Monday, May 27, 2024

దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Road Accident

భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా పారమానుపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా… మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీప సర్కార్ దవాఖానకు తరలించారు. బాధితుల కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతున్నాడా…. లేక అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా.. అనే దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Four Died in Road Accident At Odisha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News