Sunday, June 22, 2025

ఆ సినిమా అల్లు అర్జున్‌తో కాదు.. స్పష్టత ఇచ్చిన దర్శకుడు

- Advertisement -
- Advertisement -

‘పుష్ప-2’ వంటి గ్రాండ్ సక్సెస్ అందుకున్న తర్వాత విభిన్నమైన సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ప్రస్తుతం ఆయన ఆట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా మాలీవుడ్ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘శక్తిమాన్’ అనే ప్రాజెక్టు తెరకెక్కుతుందని సోషల్‌మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై తాజా బసిల్ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా అల్లు అర్జున్‌తో చేయడం లేదని ఆయన తెలిపారు.

1997లో వచ్చిన ‘శక్తిమాన్’ అనే టెలివిజన్ సిరీస్‌ని చిత్రంగా తీసుకురావాలని బాలీవుడ్‌లో ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ కథ కోసం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, మధ్యలో అల్లు అర్జున్‌తో చేస్తున్నారని రూమర్స్ రావడంతో ఫ్యాన్స్ తికమక పడ్డారు. కానీ, ఇప్పుడు దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టులో హీరో రణ్‌వీర్ సింగే అని క్లారిటీ వచ్చింది.

కాగా, అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్యారలల్ లైఫ్, పునర్జన్మల కాన్సెప్ట్‌లో ముడిపడి ఉండే ప్రాజెక్టు ఇది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా కోసం హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ స్టూడియో పని చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News