Tuesday, April 23, 2024

రోజుకో నాలుగైనా తినండి!

- Advertisement -
- Advertisement -

 

బాదం పలుకుల్ని చూడగానే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకో నాలుగైనా తినమంటున్నారు పోషకాహార నిపుణులు. నెల రోజులు తిరిగేసరికి శరీరంలో అనూహ్యమైన, అందమైన, ఆరోగ్యమైన మార్పులు కనిపించడం ఖాయం అంటున్నారు.

 

ఊబకాయమూ దార్లోకొస్తుంది. బాదం తైలం సుఖనిద్రను ఇస్తుందనీ, ఒత్తిడిని నివారిస్తుందనీ నిపుణులు చెబుతున్నారు. బాదం గుండెకు కూడా మంచిదే. కొందరికి పాలు ( పాలలోని లాక్టోజ్) పడవు. అలాంటి వారికి బాదం పాలే ప్రత్యామ్నాయం. లక్షణంగా కాఫీ, టీలు చేసుకోవచ్చు. ఆల్మండ్‌తో తక్షణ ఎనర్జీ గ్యారెంటీ!

పచ్చిగా లాగించినా, గరంగరం తిన్నా, గార్నిష్ చేసుకున్నా ఎలాగైనా బాదం సూపర్ టేస్టుగా ఉంటుంది. మధ్యతరగతి దేశాలకు బాదం కాస్త ఖరీదైన ఆహారమే. అయినా కూడా వాడకంలో మాత్రం మనవాళ్లు ముందుంటారు. రోజుకు నాలుగు పలుకులు నమిలేంత స్థోమత లేకపోతే.. ఒక్కముక్కయినా తింటున్నారు. బాదం పువ్వు నుంచి వచ్చిన విత్తనాలివి. బాదం ఖీర్, బాదం హల్వా, బాదం బర్ఫీ.. ఇవన్నీ భారతీయ ఆహారం కాబట్టి బాదం కూడా ఇక్కడే పుట్టి పెరిగిందేమో అనుకుంటున్నారంతా.

ఇదీ అబద్ధమే. వీటిని పూర్వం ‘ గ్రీక్ నట్స్’ అని కూడా పిలిచేవారు. గ్రీసు దేశంలో పుట్టాయని చరిత్రకారులు చెబుతారు. బైబిలులో కూడా బాదం ప్రస్తావన ఉంది. బైబిలు ప్రకారం క్రీస్తు పూర్వం 1140 నుంచి 1400 సంవత్సరాల మధ్యలో వీటిని పుష్కలంగా పండించేవారట. మనదేశం విషయానికి వస్తే, ఆహారంతో పాటే సంప్రదాయంలోనూ భాగంగా మారింది. దేవుళ్లకు పెట్టే తీపి ప్రసాదాల్లో కచ్చితంగా బాదం పలుకులు ఉండాల్సిందే.

కాలిఫోర్నియా టాప్ : ఎక్కడో గ్రీసులో పుట్టిన బాదం.. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ మీదుగా అమెరికా చేరింది. దాదాపు 18వ శతాబ్దంలో కాలిఫోర్నియాలో అడుగుపెట్టింది. కాలిఫోర్నియా కొన్నేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద బాదం ఎగుమతిదారుగా మారింది. అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, అందులోనూ ఆ ప్రాంతంలో తేనెటీగలు అధికంగా ఉండటంతో బాదం విరగకాసింది. ఇప్పటికీ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బాదం పంటలో 85శాతం కాలిఫోర్నియా నుంచే వస్తోంది. అక్కడ, ఫిబ్రవరిలో వసంతం వచ్చి పువ్వులు విచ్చుకుంటాయి. ఆ పువ్వులపై ఎనిమిది వేల కోట్ల తేనెటీగలు వాలతాయట. మనదేశంలో ఒక్క కశ్మీర్ ప్రాంతంలోనే బాదం చెట్లున్నాయి. ఆ పంటతోనే మనం సర్దుకుపోతున్నాం. అఫ్గాన్‌లో కూడా బాదం బాగా పండుతుంది. మన ఉత్పత్తి సరిపోకపోతే అక్కడి నుంచి దిగుబడి చేసుకుంటాం.

 

Almonds benefits in telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News