Monday, May 13, 2024

లోక్‌ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశ పెట్టిన అమిత్ షా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చట్టాన్ని ఆమోదించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా షా ప్రసంగించారు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ ఏదైనా చట్టాన్ని తీసుకురావచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దయచేసి ఈ బిల్లు తీసుకురావడానికి తనకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను షా కోరారు.

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: కెసిఆర్‌ను కలిసిన టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News