Friday, September 19, 2025

ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకిన తల్లి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ తల్లి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సోమల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాణి అనే వివాహిత తన భర్త, ఇద్దరు కూతుళ్లు జోష్మిత, హిమశ్రీతో కలిసి ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి గ్రామ శివారులో గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు కనిపించకపోవడంతో గ్రామస్థులు వెతకగా గ్రామ శివారులో గల బావిలో వారి మృతదేహాలను గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News