Wednesday, April 17, 2024

రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: నవదంపతులు గ్రామ దేవత పండుగకు వెళ్లి వస్తుండగా బైక్‌ను లారీ ఢీకొట్టడంతో నవ వధువు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం గతరపువలసలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఫిబ్రవరి 18న చంద్రతేజాదేవి(28) అనే యువతి, పైడిరాజును పెళ్లి చేసుకుంది. విశాఖనగరంలోని మద్దిలపాలెం నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళంలోని సింగనబందలో గ్రామ దేవత పండుగ ఉండడంతో బుల్లెట్‌పై నవ దంపతులు ఆ గ్రామానికి వెళ్లారు. తిరిగి బుల్లెట్‌పై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తుండగా సంగివలస మూడుగుళ్ల వద్ద వాహనం హ్యాండిల్‌కు లారీ తగలడంతో ఇద్దరు కిందపడ్డారు. చంద్రతేజాదేవికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. గాయపడిన పైడిరాజును ఆస్పత్రికి తరలించారు. వివాహం జరిగిన నెల రోజులకే నవ వధువు చనిపోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. అనాకపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం భీమిలి ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News