Wednesday, May 1, 2024

సాగర తీరాన క్రికెట్ సందడి

- Advertisement -
- Advertisement -

నేడు విశాఖలో చెన్నైతో ఢిల్లీ పోరు
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రంలోని విశాఖపట్నంలో క్రికెట్ సందడి నెలకొంది. ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలి విడత మ్యాచ్‌లకు ఢిల్లీ తమ హోం గ్రౌండ్‌గా విశాఖను ఎంపిక చేసుకుంది. ఇందులో భాగంగా ఈ మ్యాచ్ విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. డిఫెండిం గ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో జోరుమీదుండగా, ఢిల్లీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓట మి పాలైంది. దీంతో చెన్నైతో జరిగే మ్యాచ్ ఢిల్లీకి చావోరేవోగా తయారైంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఢిల్లీ పోరుకు సిద్ధమైంది. బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో బాగానే ఉన్నా ఢిల్లీకి వరుస ఓటములు తప్పడం లేదు. తొలి మ్యాచ్‌లో పంజాబ్, కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఢిల్లీ పరాజయం చవిచూసింది. ఇలాంటి స్థితిలో బలమైన చెన్నైతో జరిగే పోరు ఢిల్లీకి సవాల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఢిల్లీ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. డేవిడ్ వార్న ర్, మిఛెల్ మార్ష్, కెప్టెన్ రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, రికి భుయ్ వంటి స్టార్ బ్యాటర్లు ఢిల్లీకి అందుబాటులో ఉన్నా రు. అయితే వార్నర్ ఒక్కడే కాస్త నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. కిందటి మ్యాచ్‌లో కెప్టెన్ పంత్, స్టబ్స్ కాస్త మెరుగ్గా ఆడారు. కానీ ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో ఢిల్లీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లోనై నా బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఢిల్లీకి గెలుపు అవకాశాలుంటాయి.

హ్యాట్రిక్‌పై కన్ను..

ఇక, ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న చెన్నై ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకం గా ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోం ది. గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సిఎస్‌కె 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివమ్ దూబె, డారిల్ మిఛె ల్, సమీర్ రిజ్వీ తదితరులు జోరుమీదున్నారు.

ఓపెనర్లు రుతురాజ్, రచిన్‌లు దూకుడు మీదుండడం చెన్నైకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. శివమ్ దూబె, మిఛెల్‌ల రూపం లో విధ్వంసక బ్యాటర్లు ఉండనే ఉన్నారు. అంతేగాక ముస్తఫిజుర్, దీపక్ చాహర్, మతీషా పతిరణ, జడేజా, తుషార్ తదితరులతో చెన్నై బౌలింగ్ కూడా బలంగా ఉంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న చెన్నైకి ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News