Sunday, May 5, 2024

మరో వంద ఆరోగ్య మహిళ కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

12న ప్రారంభించిన సిఎం కెసిఆర్

372కు చేరనున్న ఆరోగ్య మహిళా కేంద్రాలు
ఇప్పటివరకు 2,78,317 మందికి పరీక్షలు

ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సిఎం కెసిఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఆరోగ్య కేంద్రాలను ఈనెల 12వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా, కొత్తవాటితో ఆ సంఖ్య 372కు పెరగనుందని పేర్కొన్నారు. ఆరోగ్య మహిళ ద్వారా ఇప్పటి వరకు 2,78,317 మందికి స్క్రీనింగ్ నిర్వహించి, అవసరం ఉన్న 13,673 వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లినట్లు చెప్పారు. 5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ఏఎన్‌ఎంల పిఆర్‌సి, ఏరియర్స్ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంజూరు చేసిన డిఎంహెచ్‌ల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

8 రకాల సేవలు ఇవే..
మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..
థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్తో అవగాహన కలిగిస్తారు.
నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News