Tuesday, October 15, 2024

కేరళలో మరో ఎంపాక్స్ కేసు

- Advertisement -
- Advertisement -

పరిస్థితి మదింపునకు ఉన్నత స్థాయి సమావేశం

తిరువనంతపురం : కేరళలో మరొక ఎంపాక్స్ కేసు నమోదైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఆ లక్షణాలు ఉన్నవారు చికిత్స చేయించుకోవలసిందని ఆరోగ్య శాఖ కోరింది. కొత్త లక్షణంతో దేశంలోని తొలి నిర్ధారిత కేసును కేరళ తెలియజేసింది. పరిస్థితిని మదింపు వేయడానికి శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. రోగి కాంటాక్జ్ జాబితాను రూపొందించినట్లు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగివచ్చిన ప్రతి ఒక్కరు ఎటువంటి లక్షణాలు ఉన్నా ఆరోగ్య శాఖను సంప్రదించి, చికిత్స చేయించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News