Tuesday, October 15, 2024

ఈ ఏడాది మొదట్లో నిర్మాణంలోనే చైనా జలంతర్గామి మునిగిపోయింది!?

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: చైనా అణు జలంతర్గామి నిర్మిస్తుండగానే ఈ ఏడాది మొదట్లో మునిగిపోయిందని అమెరికా అధికారులు గురువారం తెలిపారు. తన మిలిటరీ శక్తిని పెంచుకోవాలనుకుంటున్న చైనా కు ఇదో మింగుడుపడని విషయం.

ఝౌ(Zhou)- క్లాస్ జలాంతర్గామి మునిగిపోవడం ఇదే మొదటిసారి.  మే -జూన్ మధ్య ఒక స్తంభం పక్కన మునిగిపోయిందని  సీనియర్ అమెరికా రక్షణ అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. యాంగ్జీ నదిపై వుచాంగ్ షిప్‌యార్డ్ సమీపంలో క్రేన్‌లు , రెస్క్యూ పరికరాలతో చుట్టుముట్టబడిన జలాంతర్గామి పాక్షికంగా మునిగిపోయిందని అమెరికా రక్షణ నిపుణులు విశ్లేషించిన ప్లానెట్ ల్యాబ్స్ పిబిసి ఉపగ్రహ చిత్రాలు చూయించాయి.

ఇదిలావుండగా జలాంతర్గామి మునిగిపోయిన విషయాన్ని చైనా ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించలేదు. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ, “మీరు పేర్కొన్న పరిస్థితి గురించి మాకు తెలియదు , ప్రస్తుతం అందించడానికి మా వద్ద సమాచారం లేదు” అన్నారని వార్తా సంస్థ ‘రాయిటర్స్’ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News