Thursday, April 18, 2024

మండలి ఛైర్మన్ కు పాలాభిషేకం చేసిన ఎపి రైతులు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ మూడు రాజధానుల బిల్లును బుధవారం సెలెక్ట్ కమిటీకి పంపడంపై అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి పాత బస్టాండ్ వద్ద రైతు జెఎసి నాయకులు ఆయన ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అమరావతిని రాజధానిగా సజీవంగా ఉంచాలని పోరాడుతున్న తమకు చైర్మన్ అండగా నిలిచారని రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు, వైయస్ఆర్సిపి సభ్యుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రజల వైపు నిలబడ్డారని చైర్మన్ ను ప్రశంసించారు. వైసిపి ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని, ప్రజల అభీష్టం మేరకే రాజధాని నిర్మాణం జరగాలని జెఎసి నాయకులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News