Sunday, April 28, 2024

24ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్..

- Advertisement -
- Advertisement -

Gang Rape

 

ఇరవైనాలుగేళ్ల ఓ గిరిజన మహిళపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన ఛత్తీష్ ఘడ్ లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి నివస్తోంది. ఆదివారం సాయంత్రం బాల్కో నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవికి కట్టెల కోసం వెళ్తున్న ఆమెను చూసిన ముగ్గురు నిందితులు ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఎవరులేని ప్రాంతంలో ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Tribal woman gang raped by 3 men in Chhattisgarh

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News