Thursday, May 2, 2024

నేడు సద్దుల బతుకమ్మ…

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన సద్దుల బతుకమ్మ సంబురాలకు నగరం ముస్తాబు అవుతోంది. 9 రోజుల బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా శనివారం 8 రోజున వెన్నముద్దల బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసిన మహిళలు 9వ రోజు న ఆదివారం సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బతుకమ్మ పండుగ అధికారంగా నిర్వహిస్తుండడంతో సద్దుల బతుకమ్మకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో కోడ్ అమల్లో ఉండడంతో రాజకీయ పార్టీల నేతల హడవీడి పెద్దగా లేకుండానే ఈ ఏడాది ఉత్సవాలు జరగనున్నాయి. కోడ్ నేపథ్యంలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలోనే బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏడాది మాదిరిగానే సద్దుల బతుకమ్మకు ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళ పెద్ద ఎత్తున పాల్గొనుండడంతో ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా విద్యుత్ లైట్ల ఏర్పాటు పాటు కనీస సౌకర్యాలను కల్పించారు.. నెక్లెస్ రోడ్‌లోని కర్బలా మైదానం, పివి ఘాట్, ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ ప్రాంతాలను సద్దుల పండుగ సందర్భంగా అంబేద్కర్ నగర్, కర్బలా మైదానం, పివిఘాట్‌ల్లో పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ , లా ఆండ్ ఆర్డర్ పోలీసులు వాహనాల దారి మళ్లింపునకు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే మహిళలకు జలమండలి ద్వారా మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News