Thursday, April 18, 2024

గంజాయి ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -
marijuana-gang
 ఘట్కేసర్ వద్ద ఒఆర్‌ఆర్‌పై కాపుకాసిన పోలీసులు

హైదరాబాద్: గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఓ ముఠాను ఎల్ బినగర్ జోన్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ముఠా విశాఖ పట్నం జిల్లా ధరవ కొండ నుంచి గంజాయిని కోనుగొళ్ళు చేసి మహారాష్ట్రలోని షిర్డీకి అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా  సమాచారం అందుకున్న ఎస్‌ఓటి పోలీసులు అవుట్ రింగ్‌రోడ్ ఘట్కేసర్ టోల్ ఫ్లాజా వద్ద కాపు కాసి ఈ ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ముఠా నుంచి 51 కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌పోన్లు, రూ.4.500 నగదుతోపాటు ఇనోవా కారు మొత్తం రూ.10.37లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఇందుకు సంబంధించి వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. సూర్యపేట జిల్లాకు చెందిన ధరవత్ వంశీ నాయక్, ధరవత్ రాజు నాయక్, జటవత్ రత్తన్ లాల్ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి గత మూడేళ్లుగా నగరంతో పాటు ఇతర ప్రాంతాలో గంజాయి అమ్మకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురుతో కూడిన ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం జిల్లా ధవరకొండ నుంచి కిలో గంజాయి రూ.2000ల చోప్పున కొనుగోలు చేసి దానిని రూ.7000లకు అమ్ముతుంటారన్నారు. ఈ ముగ్గురిని రెడ్ హ్యాండెంట్ పట్టుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

ఈ ముగ్గురితో పాటు ఈ కేసుతో అంకత్ నాగరాజు, మహారాష్ట్రకు చెందిన కరన్ ఇద్దరి వ్యక్తులకుసంబంధం ఉందని, అయితే వారు ప్రసుత్తం పరారీలో ఉన్నారని తెలిపారు. గంజాయి అక్రమ రవాణకు సంబంధించి ఇప్పటీకే వంశీ నాయక్‌తో పాటు అంకత్ నాగరాజుపై వైజాగ్‌లోని కెడిపేట పోలీసు స్టేషన్‌తో పాటు జనగామ పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు గంజాయి అక్రమ రవాణకు సంబంధించి ఇప్పటీకే వంశీ నాయక్‌తో పాటు అంకత్ నాగరాజుపై వైజాగ్‌లోని కెడిపేట పోలీసు స్టేషన్‌తో పాటు జనగామ పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు పెండింగ్ ఉన్నాయని అదేవిధంగా వరంగల్ పోలీసు కమిషరేట్ పరిధిలో వంశీ నాయక్‌కు పిడి యాక్టు సైతం ఉందని వెల్లడించారు. మీడియా సమావేశంలో అడిషల్ కమిషనర్ జి. సుధీర్ బాబు, మల్కాజ్‌గిరి జోన్ డిప్యూటి కమిషనర్ రక్షిత మూర్తి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ఎస్‌ఓటి) జె.సురేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌టి.రవికుమార్, ఘట్కేసర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.రఘువీర్ రెడ్డితో కూడిన పోలీసుల బృందం పాల్గొన్నారు.

Arrested marijuana gang in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News