Friday, April 19, 2024

రాష్ట్రానికి మరో అవార్డు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : డిజిటల్ ఇండియా అవార్డుల్లో తెలంగాణకు అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం ఢిల్లీ జరిగిన అవార్డుల ఫంక్షన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి అవార్డును స్వీకరించారు. దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా,విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్రం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో కేంద్రం ప్రభుత్వ విజన్‌ను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. దీనికి అనుగుణంరా రాష్ట్ర ప్రభుత్వం అనేక స్టార్టప్‌లను ప్రొత్సహించడమే కాకుండా అట్టడుగు స్థాయి డిజిటల్ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపించింది.

ఈ నేపథ్యంలో ఏడవ ఎడిషన్ కింద పౌరుల డిజిటల్ సాధికారత, అట్టడుగు స్థాయిలో డిజిటల్ కార్యక్రమాలు, వ్యాపార సౌలభ్యం కోసం డిజిటల్ కార్యక్రమాలు సామాజిక ఆర్థిక అభివృద్ధికి డేటా భాగస్వామ్యం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. దీనిపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. రాష్ట్రానికి వచ్చిన డిజిటల్ అవార్డుపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కెటిఆర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలిజీని ప్రొత్సహిస్తోందన్నారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఐటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధిస్తుండడం పట్ల ట్విట్టర్ ద్వారా కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News