Saturday, April 27, 2024

అదృశ్యమైన సర్పంచ్ భర్త మృతి

- Advertisement -
- Advertisement -

 

బాబాపూర్: అదృశ్యమైన సర్పంచ్ భర్త మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా బాబాపూర్ లో వెలుగులోకి వచ్చింది. బాబాపూర్ సర్పంచ్ కొమ్ము శ్రీవిద్య భర్త అర్జున్ బుధవారం నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సర్పంచ్ కోసం వెతకడం ప్రారంభించారు. కాగా ఆదివారం ఉదయం లక్ష్మణ చాంద- కంజర్ మార్గంలో మృతదేహంపై బైక్ పడి ఉండడంతో వాహనదారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలువలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి చూస్తే అర్జున్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ భర్త మృతిపై అనుమానాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారా? లేక మద్యం మత్తులో బైక్ నడిపిస్తూ కాలువలో అర్జున్ పడిపోయి ఉంటాడా? అని పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

Babapur Sarpanch Husband Died in Nirmal District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News