Monday, April 29, 2024

భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్‌ల రద్దు

- Advertisement -
- Advertisement -

mobile-services

ఢాకా : భద్రతా కారణాల దృష్టా భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్‌లను బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల 10 మిలియన్ సబ్‌స్ర్కైబర్లకు అసౌకర్యం కలుగుతుందని మీడియా కథనాలు మంగళవారం వెల్లడించాయి. 2000 ప్రసార స్టేషన్లు మూసివేయడంతో 32 జిల్లాలకు చెందిన వినియోగదారులకు ఎలాంటి మొబైల్ కనెక్షన్లు ఉండబోవని బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ (బిటిఆర్‌సి) అధికారులు వివరించారు.

భారత పార్లమెంట్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని వ్యతిరేక ప్రభావం బంగ్లాదేశ్‌పై ఉంటుందని ఆపరేటర్లకు ప్రభుత్వ నుంచి ఆదేశాలు అందాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కిలోమీటర్ పరిధిలో ఈ సర్వీసులు ఏమాత్రం పనిచేయవు. గ్రామీణ్ ఫోన్, టెలిటాక్, రోబి, బంగ్లాలింక్ తదితర సర్వీస్‌ల వారికి సరిహద్దుల్లో నెట్‌వర్క్ కవరేజి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఉండబోవని బిటిఆర్‌సి ఛైర్మన్ జహురుల్ హక్ తెలిపారు. ఈ విషయం తమకేమీ తెలియదని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమల్, విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మొమెన్ చెప్పారు.

Bangladesh Government Suspends Mobile Services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News