Friday, May 3, 2024

ఇప్పుడే స్పందించడం తగదు: గంగూలీ

- Advertisement -
- Advertisement -

Ganguly

కోల్‌కతా: రానున్న రోజుల్లో టెస్టు క్రికెట్ మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2023 నుంచి టెస్టులను నాలుగు రోజుల మ్యాచ్‌గా నిర్వహించాలనే ఐసిసి భావిస్తోంది. దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనను ఐసిసి చేయలేదు. కాగా, దీనిపై భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించేందుకు నిరాకరించాడు. ఐసిసి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రతిపాదన రాలేదని, అలాంటి సమయంలో దీనిపై తాను స్పందించడం సరైంది కాదని స్పష్టం చేశాడు.

తొలుత దీనికి సంబంధించి ఐసిసి ప్రతిపాదన రావాలి. దానిని చూసిన తర్వాత ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నాడు. అప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేసేది లేదని తేల్చి చెప్పాడు. ఒకవేళల ఐసిసి టెస్టు క్రికెట్ మ్యాచ్‌ను కుదించాలని భావిస్తే ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపడం ఖాయమన్నాడు. ఆ తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నాడు. ఇక, తనకు ఐసిసి నుంచి ప్రతిపాదిన అందితేనే స్పందిస్తానని తెలిపాడు.

Too early to say

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News