Friday, May 10, 2024

వసతిగృహాల్లో బోగస్ విద్యార్ధుల ఏరివేత

- Advertisement -
- Advertisement -

biometric-attendance

హైదరాబాద్: నగరంలో పేద విద్యార్ధుల కోసం ప్రభుత్వం హాస్టళ్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన వసతులు, ఉపకారవేతనాలు అందజేస్తుంది. కానీ హాస్టళ్లలో కళాశాల, పాఠశాలకు చెందిన విద్యార్ధులే కాకుండా ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూ విద్యార్దులుగా చలామణి అవుతూ ప్రభుత్వానికి గండికొడుతున్న బోగస్ విద్యార్ధులను కట్టడి చేసేందుకు జిల్లా సంక్షేమ శాఖాధికారులు నడుంబిగించారు. నేటి నుంచి ముందుగా కళాశాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు సిద్దమయ్యారు. ఈవిధానం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తే హాస్టళ్లలో ఐదారు ఏళ్లుగా అనధికారకంగా ఉండే నాన్‌బోర్డర్ల సమస్యక్ చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అయితే గత ఆరునెలల నుంచి బిసి కళాశాల హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నారు. కానీ విద్యార్ధులు పాటించడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొత్త ఏడాది నుండి బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా చేయడంతో సమస్యలు పరిష్కారం కానుంది. జిల్లాలో బిసి వసతి గృహాలంటిన్నీ ఈపాస్, ఈహాస్టల్స్ మేనేజ్‌మెంటే విధానంతో టిఎస్‌టిఎస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేశారు. పాఠశాల, కళాశాల స్దాయి వసతిగృహాలన్నింటిని అనుసంధానం చేశారు. వారం రోజుల కితం జిల్లాల వెనకబడిన తరగతుల ఉపసంచాలకులు, జిల్లా వెనకబడిన అభివృద్ది అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బయోమెట్రిక్ హాజరు అంశంపై చర్చించారు. హాజరు పారదర్శకంగా , మరింత పకడ్బందీగా నమోదు చేసేందుకు బయోమెట్రిక్ అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 1 నుంచి కళాశాల స్దాయి, జనవరి 15 నుంచి పాఠశాల స్దాయి నుంచి వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా పోస్టుమెట్రిక్ స్దాయిలో 38 కళాశాల హాస్టళ్లు, వీటిలో 16 వసతి గృహాలు బాలికలు, 22వసతి గృహాలు బాలుర కోసం నిర్వహిస్తున్నారు. వీటిలో 4800 మంది విద్యార్దులున్నారు. ఇక ప్రీ మెట్రిక్ స్దాయిలో 12వసతి గృహాలుండగా వీటిలో 4వేల మంది బాలుర కోసం 8 వసతి గృహాలను బాలిక కోసం నడిపిస్తున్నారు. వీటిలో 894 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ఉదయం, సాయంత్రం సమయంలో తప్పకుండా బయోమెట్రిక్ హాజరను నమోదు చేయాల్సి ఉంటుంది.

నెలవారిగా ఎంతమంది హాజరు అవుతున్నారో గుర్తించి వారికే బిల్లులు, బోజన ఖర్చుల నిధులు అందజేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. మరో పక్క విద్యార్దిసంఘాల నాయకులు విద్యార్ధులకు నెలవారీగా అందజేసే బిల్లులు, హాస్టళ్లలో వసతులు సక్రమంగాలేవని, వాటిని తక్షణమే ఏర్పాటుచేసి బలహీనవర్గాలకు చెందిన విద్యార్ధులు ఉన్నత చదువుల వైపు వెళ్లే విధంగా చూడాలని కోరుతున్నారు.

Biometric System in Hostels in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News