Tuesday, September 16, 2025

కష్టాల్లో బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ కష్టాల్లో చిక్కుకుంది. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే బంగ్లాదేశ్ మరో 248 పరుగులు చేయాలి.

ఓపెనర్ జకీర్ హసన్ (5), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (5), మాజీ సారథి మోమినుల్ హక్ (5) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. విశ్వ ఫెర్నాండో రెండు, కసున్ రజిత్ ఒక వికెట్ తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టారు. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (102), కమిండు మెండిస్ (102) శతకాలతో జట్టును ఆదుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News