Monday, March 4, 2024

గ్రేటర్‌లో అటహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ

- Advertisement -
- Advertisement -

చీరలను చూసి మురిసిపోతున్న మహిళలు
838 పంపిణీ కేంద్రాలు
8,57,600 మంది లబ్దిదారులు

Bathukamma sarees distribution in Hyderabad

మన తెలంగాణ/సిటీ బ్యూరో: బతుకమ్మ పండుగకు ప్రభుత్వం కానుకగా అందజేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం గ్రేటర్‌లో శనివారం అటహాసంగా ప్రారంభమైంది . మహిళల మనుస్సును దోచే విధంగా 20 రంగులు 30డిజైన్లతో ప్రత్యేక ఆకర్షణగా 810 రకాల చీరలను ఈ ఏడాది ప్రభుత్వం పంపిణీచేస్తోంది. దీంతో ఈ చీరలను అందుకున్న మహిళలు వాటిని చూసి మురిసిపోయారు. గ్రేటర్ వ్యాప్తంగా 838 కేంద్రాలు, 1376 రేషాన్ షాపుల ద్వారా ఈ చీరల పంపిణీ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి జిహెచ్‌ఎంసి పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ప్రతి పంపిణీ కేంద్రం వద్ద కోవిడ్ నిబంధనలను పాటించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అన్ని కేంద్రాల వద్ద సబ్బులు, నీళ్లను అందుబాటులో ఉంచింది. చీరల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి పంపిణీ కేంద్రాని ప్రత్యేక అధికారి నియమించింది. ఈ అధికారి ఆధీనంలో చీరల పంపిణీ కొనసాగిస్తున్నారు. పంపిణీకి సంబంధించి జిహెచ్‌ఎంసి, స్వయం సహాయక బృందం మహిళ ప్రతినిధి, రేషన్ డిలర్‌లో ప్రత్యేకం కమిటీని ఏర్పాటు చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని జోనల్, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది అనుభవానలు దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ ఏడాది పటిష్ట ఏర్పాట్లను చేశారు. నగరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఎక్కడికక్కడ చీరలను పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తం: మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం కానుక అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రారంభించారు. సనత్ నగర్‌లోని వెల్పేర్ గ్రౌండ్, బన్సీలాల్‌పేట్‌లోని మల్లిపర్ఫస్ ఫంక్షన్ హాల్‌లో ఆయన లబ్దిదారులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తమైందన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పె పండుగల్లో బతకమ్మ ఒకటని,ఈ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉద్దేశమని తెలిపారు. ఆ ఆలోచనతోనే 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.8 కోట్ల చీరలను రూ.333 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. చీరల పంపిణీ ద్వారా మహిళలు సంతోషంగా పండుగను జరుపుకుంటుడగా మరోవైపు ఉపాధి లేక తీవ్ర సంక్షోబంలో ఉన్న చేనత కార్మికులను ఆదుకోవాలనే లక్షం సైతం నేరవేరిందని తెలిపారు. మన సంస్కృతి ,సంప్రదాయాలను చాటి చేప్పే అన్ని పండగలను ఘనంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు గుర్తిండేలా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, కుర్మ లక్ష్మి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు వంశీ, ముకుందరెడ్డిలు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ చీర ః మేయర్ గద్వాల విజయలక్ష్మి

పండుగలకు ఆడపడుచులకు చీరల అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ డివిజన్‌లోని ఎంబిటి నగర్ పంక్షన్‌హాల్‌లో మేయర్ విజయలక్ష్మి,ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఏడాది వందల కోట్లను ఖర్చు చేసి విభిన్న డిజైన్లలో చీరలను తయారు చేయించిందన్నారు. 30 సర్కిళ్లలో 838 కేంద్రాల ద్వారా చీరల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ నిరుపేద మహిళలు పండగలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వం చీరలలను పంపిణీ చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News