Friday, May 3, 2024

90 కోట్ల డోసులు దాటిన కరోనా వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -
Covid vaccination exceeds 90 crore doses
కేంద్ర ఆరోగ్య మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు మొత్తం 90 కోట్ల మేర కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 16న మొదలుకాగా మొదటి దశలో హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫిబ్రవరి 2న ఫ్రంట్‌టైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని శాస్త్రీజీ(లాల్ బహదూర్ శాస్త్రి) అందచేయగా దానికి అటల్ జీ(వాజ్‌పేయి) జై విజ్ఞాన్ జత చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ జై అనుసంధాన్ నినాదాన్ని అందచేశారంటూ మాండవీయ ట్వీట్ చేశారు. నేడు అనుసంధాన్ ఫలితమే కరోనా వ్యాక్సిన్ అంటూ జై అనుసంధాన్ అని మాండవీయ పేర్కొన్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన మూడవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 60 ఏళ్లు పైబడిన వారితోపాటు నిర్దిష్టమైన ఇతర అనారోగ్యాలు ఉన్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందచేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టడం జరిగింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News