Monday, May 6, 2024

రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ చీరల పంపిణి

- Advertisement -
- Advertisement -

రూ.333.14 కోట్లతో ఒక కోటి 8 లక్షల చీరలు సిద్దం
30 సరికొత్త డిజైన్లలో, 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం 810 రకాల చీరల తయారీ
రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమ బలోపేతానికి నాంది పలికిన కార్యక్రమం
ఎలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపీణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామన్న మంత్రి కెటిఆర్
18 సంవత్సరాలు నిండి, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన అర్హులైన ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీర
ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలోని అడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి
2017 నుంచి గత ఎడాది వరకు మూడు కోట్ల 90 లక్షల చీరలను పంపిణీ
రానున్న రోజుల్లో మరిన్ని డిజైన్లు, ఇతర వస్త్రాలను ఉత్పత్తి చేసే దిశగా రాష్ట్రంలోని పవర్ లూమ్ కార్మికులు

Bathukamma cheeralu 2021

మన తెలంగాణ/హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణి రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం పలు జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొని బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కాగా రాష్ట్రంలోని ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బతుకమ్మ పండగ కోసం చీరల పంపిణీని ప్రారంభించినట్టు రాష్ట్ర ఐటి,పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం ఒక కోటి ఎనిమిది లక్షల చీరలను ఆడపడుచులకు కానుకగా ఇవ్వనున్నామన్నారు. ఇందుకోసం రూ. 333.14 కోట్ల ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లలో, 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు.
18 సంవత్సరాలు నిండి ఆహార భద్రత కార్డ్ కింద నమోదు అయిన అర్హులైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామాలల్లో చీరల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. కరోనా నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పంపిణీని కార్యక్రమాలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించుకున్నారన్నారు.
రాష్ట్రంలోని నేతన్నలకు గౌరవ ప్రదమైన ఆదాయం కల్పించడం, రాష్ట్ర పండగైన బతుకమ్మ పూట ఆడబిడ్డలకు చీరను అందించే రెండు ఉద్దేశ్యాలతో 2017లో బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి కెటిఆర్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వతా రాష్ట్రంలోని మరమగ్గాల నేతన్నలకు నిరంతరం పని కల్పిస్తూ వారి జీవన స్థితిని, వారి నైపుణ్యాన్ని పెంచగలిగామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగా సానుకూల ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవర్ లూమ్ కార్మికుల వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు.
రాష్ట్రంలోని సూమారు 20వేల మంది పవర్ లూమ్ నేత కార్మికులకు చేతి నిండా పని దొరికిందన్నారు. దీంతో గతంలో ఆత్మహత్మలు చేసుకున్న నేతన్నల కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఈ ప్రాజెక్టుతో నేత కార్మికుల నైపుణ్యాన్ని పెంచగలిగామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అలాగే వారిప్పుడు నూతన డిజైన్లు, వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమను మరింతగా వృద్ది చేయాలన్న ప్రభుత్వ అలోచనలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బలమైన అంశంగా మారిందన్నారు.
2017 నుంచి గత సంవత్సరం వరకు మూడు కోట్ల 90 లక్షల చీరలను పంపిణీ చేశామని మంత్రి కెటిఆర్ వివరించారు. 2017లో 95,48,439, 2018లో 96,70,474, 2019లో 96,57,813, 2020లో 96,24,384 చీరలను ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా పంపిణి చేసిందన్నారు. ప్రతి ఎడాదికేడాది చీరల తయారీ, పంపిణి ప్రక్రియలో పెను మార్పులు తీసుకువస్తున్నామని కెటిఆర్ తెలిపారు. చీరల నాణ్యత, డిజైన్లు, రంగుల ఎంపిక వంటి వాటిలో రాష్ట్రంలోని మహిళలకు క్షేత్ర స్థాయి నుంచి ప్రాతినిధ్యం ఉన్న మెప్మా, సెర్ప్ స్వయం సహాయక బృందాల్లోని మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని, నిఫ్ట్ డిజైనర్లతో రూపోందించిన డిజైన్ పాటర్న్‌లతో ఈసారి తమ శాఖ చీరలను సిద్దం చేసిందన్నారు.
గత నాలుగు సంవత్సరాల అనుభవం, నైపుణ్యాభివృద్ది నేపథ్యంలో నేతన్నలు నూతనంగా డాబీ/జాకార్డు డిజైన్లతో చీరలను ఉత్పత్తి చేసారన్నారు. ఈ చీరలన్ని జరీ అంచులతో తయారు చేయబడిన 100శాతకం పాలిస్టర్ ఫిలిమెంట్/ నూలుతో తయారు చేయబడ్డాయన్నారు. ఈసారి 6.30 మీటర్ల పొడవుగల ఒక కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షల చీరలు పంపిణీకి సిద్దంగా ఉంచామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News