Wednesday, August 6, 2025

ఈ నెల 15,16 తేదీల్లో బీఫ్ దుకాణాలు బంద్

- Advertisement -
- Advertisement -

ఆగస్టు 15, 16 తేదీల్లో పశువుల కబేళాలు , బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసి ఆదేశాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆగస్టు 15, 16, 2025 తేదీల్లో స్వాతంత్య్ర దినోత్సవం , శ్రీ కృష్ణ జన్మాష్టమి దృష్ట్యా తన పరిధిలోని అన్ని పశువుల కబేళాలు మరియు రిటైల్ బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసి ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసి చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవం, జన్మాష్టమిల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పశువుల కబేళాలు, బీఫ్ దుకాణాలను మూసివేతను అమలు చేయడంలో పురపాలక అధికారులకు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లను జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News