Saturday, May 11, 2024

‘భోళా శంకర్’ పూజా కార్యక్రమం.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

Bhola Shankar Pooja Ceremony at Hyderabad

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తోపాటు టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్లు వినాయక్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, బాబీ, వెంకీ కుడుముల, గోపీచంద్‌ మలినేని, వంశీ పైడిపల్లి పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం ముహుర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి సాగర్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ నవంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.

Bhola Shankar Pooja Ceremony at Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News