Tuesday, April 30, 2024

కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బిజెపి

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఇదివరకే అభ్యర్థుల్ని ప్రకటించాయి. తాజాగా బిజెపి తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్‌ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ బిజెపి కేంద్ర కార్యవర్గం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఇసి ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేశ్‌ను ప్రకటించగా, ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆమె సోదరి నివేదితకు బిఆర్‌ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ గత ఇద్దరు ఎంఎల్‌ఎలు పదవిలో ఉండగానే చనిపోయారు.మొదట కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సాయన్న అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్య నందిత బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆమె సైతం చనిపోవడంతో ఒకే నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎలుగా సాయన్న కుటుంబ సభ్యులు చనిపోయారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను బిజెపి తాజాగా ప్రకటించింది. యూపిలోని దద్రౌల్ నుంచి అరవింద్ సింగ్, లక్నో ఈస్ట్ నుంచి ఓ.పి. శ్రీవాస్తవ్, గైంసారి నుంచి శైలేంద్ర సింగ్ శైలు, ఎస్టీ నియోజకవర్గం దుద్ధి నుంచి శ్రావణ్ గౌడ్‌ను బిజెపి తమ అభ్యర్థులుగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News