Friday, May 3, 2024

ఎంపిలో బిజెపి నేత గోపాల్ భార్గవ తొమ్మిదోసారి విజయం

- Advertisement -
- Advertisement -

భోపాల్ :మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత గోపాల్ భార్గవ తన రెహ్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా తొమ్మిదో సారి విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రచారం చేయని నాయకునిగా ఆయనకు మంచి పేరుంది. భార్గవ (71) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి పటేల్‌పై 72,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నూతన అసెంబ్లీకి అత్యంత అనుభవజ్ఞుడైన శాసనసభ్యుడు కాబోతున్నారు. కమల్‌నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకుడిగా పనిచేసిన భార్గవ 1985లో మొట్టమొదటిసారి గెలుపొందారు.

అప్పటినుంచి గత 38 ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో అజేయుడుగానే వస్తున్నారు. 2003 నుంచి మంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. తన ఐదేళ్ల పదవీకాలంలో పూర్తిగా ప్రజాసేవకు అంకితం కావడమే తన లక్షమని , అందువల్ల తనకు ఎలాంటి ప్రచారం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి , బీజేపీ నేత , దివంగత బాబూలాల్ గౌర్ , పదిసార్లు ఎమ్‌ఎల్‌ఎగా నెగ్గుకు వచ్చారు. మరో బీజేపీ ముఖ్యమంత్రి దివంగత కైలాష్ జోషి 19621993 మధ్యకాలంలో దేవాస్ జిల్లా బగ్లీ స్థానం నుంచి ఎనిమిదిసార్లు ఎమ్‌ఎల్‌ఎగా విజయం సాధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News