Thursday, February 29, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన టిడిపి, కాంగ్రెస్ ఎంఎల్‌ఏల ఓటమి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీని వీడి అధికార బిఆర్‌ఎస్ లో చేరిన నేతలు ఓటమి పాలయ్యారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నుంచి గెలిచి బిఆర్‌ఎస్‌లో చేరిన 9 మంది ఎంఎల్‌ఏలు ఈ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ అధికారం దిశగా విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాలలో ఆ ట్రెండ్ కనిపించింది.
బిఆర్‌ఎస్‌లో చేరి ఓడిపోయిన అభ్యర్ధులు వీరే..
వనమా వెంకటేశ్వర్ రావు ( కొత్తగూడెం ), సండ్ర వెంకట వీరయ్య( సత్తుపల్లి ), రేగా కాంతారావు ( పినపాక ), హరిప్రియ నాయక్ ( ఇల్లందు ), చిరుమర్తి లింగయ్య ( నకిరేకల్ ), గండ్ర వెంకట రమణ రెడ్డి ( భూపాల పల్లి ), మెచ్చ నాగేశ్వరరావు ( అశ్వారావు పేట ), ఉపేందర్ రెడ్డి ( పాలేరు ), సురేందర్ ( ఎల్లారెడ్డి ), హర్షవర్ధన్ రెడ్డి ( కొల్లాపూర్ ), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూర్) .

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News