Thursday, May 2, 2024

కరోనా కాలంలో ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఘనత బిజెపిదే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో కరోనా నుంచి రెండున్నర ఏళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కరోనా సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలను విస్మరించేదని, పేదల పట్ల ఆపార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు.

నగరంలో నీటి సమస్య ఉందని తమకు ఫిర్యాదులు వచ్చాయని బిజెపిని గెలిపిస్తే ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించారు. ప్రధాని మోడీ దేశంలో అందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు వేయించారని గుర్తు చేశారు. ఖైరతాబాద్ భాజపా అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్మృతి ఇరానీ ఓటర్లను కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్‌ చేతుల్లో అధికారం ఉంటుందని ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News