Tuesday, April 30, 2024

హీరోయిన్లు ముంబైలో డ్యాన్సులు చేయాలి..జెఎన్‌యులో వారికేంపని?

- Advertisement -
- Advertisement -

Deepika Padukone

భోపాల్: హీరోయిన్లు ముంబైలో ఉండి డ్యాన్సులు చేయాలని, వారికి జెఎన్‌యులో పనేంటని మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నాయకుడు మోహన్ భార్గవ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ప్రముఖ సినీ నటి దీపికా పదుకోన్ ఇటీవల ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీని సందర్శించి(జెఎన్‌యు) సిఎఎకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా హీరోయిన్లు ముంబైలో ఉండి డ్యాన్సులు చేయాలని, ఆమె ఎందుకు జెఎన్‌యుకి వెళ్లిందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆమెలాంటి వారు చాలా మంది ఉన్నారని, రాజకీయాలు చేయదలిస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన భార్గవ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసరాయ్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై పోటీ చేసి ఓడిపోయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్‌ను ప్రస్తావిస్తూ చాలామంది ఎన్నికల్లో పోటీ చేశారని, బెగుసరాయ్ నుంచి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడని ఎద్దేవా చేశారు.

BJP leader controversial comments on Deepika Padukone

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News